Home  »  TV News  »  ఊహించని మలుపు .. కావ్యకి సపోర్ట్ గా నిలిచిన అపర్ణ!

Updated : May 27, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -106 లో..  ఇంట్లో అందరి ముందు అపర్ణ పరువు తీయాలని భావించిన రుద్రాణి.. కనకంని ఎంగేజ్ మెంట్ కి పిలుద్దామని అంటుంది. దానికి అపర్ణ ఒప్పుకోదు.. అయిన సరే అపర్ణ మాటలు పట్టుంచుకోకుండా.. రుద్రాణి కనకం కి ఫోన్ చేసి ఎంగేజ్ మెంట్ కి రమ్మని పిలుస్తుంది. కానీ కనకం స్వప్న కి పెళ్లి కాయం చేసేది.. అదే రోజు కావడంతో ఇంట్లో పూజ ఉంది.. నేను రాలేనని కనకం చెప్తుంది. 

మరొకవైపు రాహుల్ అలా అమ్మాయిలను ఫ్లర్ట్ చేయడం చూసి కళ్యాణ్, కావ్య ఇద్దరు అతని గురించి మాట్లాడుకుంటారు. ఎలాగైనా రాహుల్ చేస్తున్న మోసాలని వాళ్ళిద్దరు బయటపెట్టాలనుకుంటారు. మరొకవైపు రాహుల్, వెన్నెల ఎంగేజ్ మెంట్ కి ఇంట్లో వాళ్ళంతా చీరలు, నగలు అన్నీ ఇంట్లోనే సెలక్ట్ చేస్తుంటారు. ఇదేంటి ఎక్స్ క్లూజివ్ డిజైన్ నెక్లెస్ తీసుకొచ్చారు. ఇది ఇంకా మార్కెట్ లో రీలీజ్ చెయ్యలేదు కదా అని అపర్ణ అంటుంది.

"నువ్వు ఎలాగూ నీ కోడలిని పూర్ ఇంటి నుండి తెచుకున్నావ్.. నాకు కాబోయే కోడలేమో ధనవంతురాలు.. నా కొడుకు ఎంగేజ్ మెంట్  ఎక్స్ క్లూజివ్ గా జరగాలి.. అందుకే నా కోడలికి ఎక్స్ క్లూజివ్ డిజైన్.. నీ కొడుకు పెళ్లితో పోయిన మన దుగ్గిరాల ఫ్యామిలీ పరువుని నా కొడుకు పెళ్లితో తీసుకొస్తాను" అని రుద్రాణి అనగానే.. అప్పుడే కావ్య వచ్చి ఎవరి గురించి మాట్లాడుతున్నారు. మా పెళ్లి ఏ పరిస్థితులలో జరిగిందో మీకు తెలియదా? నాకు ముసుగువేసి నా పెళ్లి  మీరే జరిపించారు కదా అని కావ్య అంటుంది.

మీ ఖరీధైన కోడలికి పెట్టె నగలు.. నా భర్త డిజైన్ చేసినవి.. నీ కొడుకు రాహుల్ కాదు. మా అత్త గారు తలుచుకుంటే మీ ముగ్గురికి ఈ ఇంట్లో స్థానం ఉండదని కావ్య అనేసరికి.. రుద్రాణి కోపంతో కావ్యపై చెయ్యి ఎత్తుతుంది. రుద్రాణి ఏం చేస్తున్నావ్ చెయ్ దింపు అని అపర్ణ కోప్పడుతుంది. మా అత్తయ్య కి, మా భర్తకి సంస్కారం ఉంది కాబట్టి మీరు ఎన్ని అన్న ఒక్క మాట అనట్లేదు. వాళ్ళని మీరు ఏమైనా అంటే నేను ఒప్పుకోనని కావ్య వెళ్తుంటే అపర్ణ ఆగమంటుంది. రాజ్ కి ఒక చీర, ఎక్స్ క్లూజివ్ నెక్లెస్ ని ఇచ్చి కావ్యకి ఇవ్వమంటుంది అపర్ణ. రేపు ఇంటికి బంధువులు వస్తారు. ఈ ఇంటి కోడలు ఆ రేంజ్ లోనే ఉండాలని అపర్ణ అంటుంది. ఆ నగలు, చీర కావ్యకి ఇస్తుంటే కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. రుద్రాణి మాత్రం కోపంతో ఊగిపోతుంది.

మరొక వైపు కావ్య చీర, నగలు చూస్తూ సంతోషపడుతుంటే అపర్ణ వచ్చి.. నీకు ఈవి ఇచ్చింది కోడలిగా అంగీకరించి కాదు అందరి ముందు హుందాగా కన్పించడానికని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.. ఆ తర్వాత రాజ్ వచ్చి నాది మా మమ్మీది ఒకటే మాట అని రాజ్ అంటాడు. మరొకవైపు అటు రాహుల్-వెన్నెలల ఎంగేజ్ మెంట్ కి ముహూర్తం కాయం చేస్తారు. మరొక వైపు స్వప్న-అరుణ్ ల ఎంగేజ్ మెంట్ ముహూర్తం కాయం చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.